తిరుపతి, 3 September
టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథంను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సీబీఐ అందించిన సమాచారం ఆధారంగా ఈ అరెస్ట్ జరిగింది. తిరుపతి, తిరుమల, చెల్లూరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం అరెస్ట్ AP: టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. లడ్డూ కల్తీ నెయ్యి దర్యాప్తులో సీబీఐ అందించిన సమాచారంతో తిరుపతి, తిరుమల, చెల్లూరులో ఐదు ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. భార్య, కుమారుడి పేర్లతో ఇళ్లు, స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించింది. సోదాల్లో 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.5 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.












