లక్ష్మణచాంద, 2026-08-28
మద,అటమటదొగచందఅెటచందశ.దదదదొగచందహెమటధచంద.ఘటధచందె.
జల్సాలకు, మద్యానికి అలవాటు పడి డబ్బులు సరిపోక మోటార్ సైకిల్ దొంగిలించిన వ్యక్తిని లక్ష్మణ్ చందా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించిన హీరో స్ప్లెండర్ ప్లస్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలిపారు.
నిందితుడి వివరాలు: గుండెల శ్రీనివాస రావు (42) విజయవాడ కొత్తపేట, నెహ్రూ సెంటర్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఇతను గతంలో 9 సంవత్సరాల క్రితం విజయవాడలో బోర్ పంపు పైపులు దొంగిలించి జైలుకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. జైలు నుంచి విడుదలైన తర్వాత, మద్యం అలవాటు కారణంగా తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో, వేరే చోట పని చేయాలని నిర్ణయించుకుని నిజామాబాద్ జిల్లాకు వచ్చారు.
నిజామాబాద్ జిల్లాలో అడ్డమీద నుంచి లక్ష్మణ్ చందా గ్రామానికి చెందిన శ్రీను మేస్త్రి వద్ద పనికి కుదిరి, అతని దగ్గర పనిచేశారు. ఆ తర్వాత, మూడు నెలల క్రితం లక్ష్మణ్ చంద నుండి బాల్కొండ గ్రామానికి వెళ్లి, మాల్యాద్రి అనే మరో మేస్త్రి వద్ద పనిలో చేరి అక్కడే పనిచేస్తున్నారు. అయితే, వస్తున్న డబ్బులు ఇంటికి, తన జల్సాలకు సరిపోకపోవడంతో, దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు.
మూడు రోజుల క్రితం లక్ష్మణ్ చందా గ్రామానికి వచ్చి అక్కడే ఉంటున్న నిందితుడు, ఈ నెల 26వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు, ఒక ఇంటి ముందు తాళంచెవితో ఉన్న మోటార్ సైకిల్‌ను చూసి, దానిని దొంగిలించారు. ధర్మారం గ్రామం వైపు వెళ్తుండగా, హనుమాన్ టెంపుల్ వద్ద బైక్ పై నుంచి కింద పడి స్వల్పంగా గాయపడ్డారు. కొద్దిసేపు అక్కడే ఉండి, సోన్ వైపు వెళ్తుండగా, సోన్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తున్నారని దూరం నుంచే గమనించి, తిరిగి ధర్మారం వైపు వచ్చారు. రాత్రి కావడంతో పోచమ్మ ఆలయం వద్ద, కొద్ది దూరంలో బైక్‌ను పెట్టి, ఆలయ ఆవరణలోని రేకుల షెడ్డులో ఆ రాత్రికి నిద్రపోయారు.
ఆ తర్వాత, ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో సోన్ వైపు వెళ్తుండగా, ధర్మారం గ్రామ శివారులో వాహన తనిఖీ చేస్తున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి దొంగిలించిన హీరో స్ప్లెండర్ ప్లస్ మోడల్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణి తెలిపారు.












