మనోరంజని తెలుగు టైమ్స్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని ఆత్మహత్య కేసులో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. నగ్నంగా పరిగెత్తుకుంటూ వెళ్లి, గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులో దూకిన ఆమె ఘటన కలకలం రేపుతోంది. మృతదేహం లభ్యమైనప్పటికీ, ఆమె తీసుకెళ్లిన విగ్రహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో నిన్న నగ్నంగా పరిగెత్తి, విగ్రహంతో పాటు చెరువులో దూకిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని ఆత్మహత్య కేసులో వింత మలుపు చోటుచేసుకుంది. గుడిలోని అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని చెరువులో దూకినట్లు ఆమె గుర్తింపు పొందింది. అయితే, మృతదేహం లభ్యమైనప్పటికీ, ఆమె తీసుకెళ్లిన విగ్రహం కోసం డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి.
పోలీసుల కథనం ప్రకారం.. తేజస్విని తన దుస్తులు విప్పేసి, దిగంబరంగా సమీపంలోని ఒక గుడిలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని నేరుగా సమీపంలోని చెరువు వైపు నడిచి, నీటిలోకి దూకింది. ఆమె మృతదేహం లభ్యమైన తర్వాత, విగ్రహం కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. ఈ కేసులో ఆ విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో, డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో చెరువులో విగ్రహం కోసం వెతుకుతున్నారు.
ఈ దర్యాప్తులో తేజస్విని ఉంటున్న నివాసానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె ఒక అద్దె ఫ్లాట్లో ఉంటున్నట్లు, దానికి రోజుకు రూ. 3,500 చొప్పున నెలకు దాదాపు రూ. లక్ష వరకు అద్దె చెల్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, ఆమె ఉంటున్న భవనంలోని పై రెండు అంతస్తులను అక్రమంగా ఒక లాడ్జిలా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీనికి తేజస్విని మృతికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ ఘటనను ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, ఆమె అలా ప్రవర్తించడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు తేజస్విని తల్లి అరుణను ప్రశ్నించడంతో పాటు, ఆమె రాసినట్లుగా భావిస్తున్న డెత్ డిక్లరేషన్, ఇటీవలి ఆర్థిక లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.











