హైదరాబాద్, జూలై 13
రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో ప్రధాన నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన మేనమామ ఊరు అయిన కొత్తూరులోని ఓ వెంచర్ వద్ద అతడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన మేనమామ ఊరు అయిన కొత్తూరులోని ఓ వెంచర్ వద్ద రాజ్‌కుమార్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు అక్కడ పరిశీలన చేశారు.
ఒక బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో పోక్సో కింద అరెస్ట్ అయి, జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చిన రాజ్‌కుమార్.. ఆ ఘటనతో కోపం పెంచుకుని, బాధిత బాలికతోపాటు తల్లి, నానమ్మను, తన భార్య, ఇద్దరు పిల్లలను కలిపి మొత్తం ఆరుగురిని ఒకే రాత్రిలో అతి కిరాతకంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. పంజర్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతుడిని షాబాద్ ఆరు హత్యల కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌కుమార్‌గా గుర్తించారు.
రాజ్‌కుమార్ మృతదేహం పక్కనే విషం బాటిల్ లభ్యం కావడంతో.. అతడు విషం తాగి చనిపోయినట్లు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురిని హత్య చేసిన తర్వాత తనను పట్టుకునేందుకు పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపు చేపట్టడంతో తీవ్ర భయాందోళనలకు గురై, తప్పించుకునే అవకాశం లేకపోవడంతో పురుగుల మందు తాగి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
హత్యల తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు 14 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. పోలీసుల గాలింపు చర్యలు తీవ్రం కావడంతో అతడికి ఎక్కడా ఆశ్రయం దొరకలేదని, చివరికి కొత్తూరు మండలం లోని తన మేనమామ ఊరైన పంజర్లకు చేరుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ గ్రామ శివారులోనే పురుగుల మందు తాగి చనిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు.












