నిర్మల్, 2026-07-19
నిర్మల్ జిల్లాలో జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఆదేశాల మేరకు ఈ అరెస్టులు జరిగాయి. ఈ కేసు వివరాలను నిర్మల్ డిఎస్పీ పి.శ్రీనివాస్ వెల్లడించారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిర్మల్ డిఎస్పీ పి.శ్రీనివాస్ తెలిపారు.
1. శివరాత్రి ధర్మరాజు, తండ్రి: పోశెట్టి, వయస్సు: 19, కులం: వడ్డెర, నివాసం: సారంగాపూర్, నిర్మల్ జిల్లా. 2. షేక్ అహ్మద్, తండ్రి: షేక్ వాజీద్, వయస్సు: 21, కులం: ముస్లిం, నివాసం: సారంగాపూర్, నిర్మల్ జిల్లా. 3. షేక్ ఆసిఫ్, తండ్రి: షేక్ వాజీద్, వయస్సు: 22, కులం: ముస్లిం, నివాసం: సారంగాపూర్, నిర్మల్ జిల్లా. 4. ననిగంటి రాహుల్ రెడ్డి, తండ్రి: నరసింహ రెడ్డి, వయస్సు: 21, కులం: రెడ్డి, నివాసం: సారంగాపూర్, నిర్మల్ జిల్లా. 5. భోదాసు శేఖర్, తండ్రి: ఎల్లయ్య, వయస్సు: 24, కులం: వడ్డెర, నివాసం: సారంగాపూర్, నిర్మల్ జిల్లా.
డిఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, సారంగాపూర్ గ్రామానికి చెందిన మునిమాన్కల కాశన్న (55), వృత్తి: చాకలి, సాయన్న కుమారుడు, అదే గ్రామానికి చెందిన శివరాత్రి లస్మవ్వ (మృతుని కొడుకు శివరాత్రి ధర్మరాజు తల్లి)తో అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానించారు. ఈ నేపథ్యంలో, లస్మవ్వ కుమారుడైన శివరాత్రి ధర్మరాజు, కాశన్నను చంపాలని ప్రణాళిక రచించాడు. తేది: 04-07-2026న రాత్రి సుమారు 7 గంటలకు, కాశన్న మందుల కోసం మెడికల్ షాప్‌కు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా, ధర్మరాజు అతన్ని వెంబడించాడు. నిర్మానుష్యంగా ఉన్న కేదార్నాథ్ జిన్నింగ్ మిల్లు వద్ద కాశన్నను పట్టుకొని, చేతులతో కడుపులో గుద్ది, అక్కడున్న కర్రతో కాళ్లపై కొట్టాడు. అనంతరం తన స్నేహితులైన షేక్ అహ్మద్, షేక్ ఆసిఫ్, నానిగంటి రాహుల్ రెడ్డి, భోదాసు శేఖర్‌లను పిలిపించుకొని, అందరూ కలిసి కాశన్నను చేతులతో కొట్టి, కింద పడేసి కాళ్లతో తన్నారు. అదే సమయంలో, కాశన్న సోదరుడు మునిమాన్కల శ్రీనివాస్, బంధువు మునిమనికల హరీష్, అతని స్నేహితుడు త్రినేష్ అక్కడికి చేరుకున్నారు. వారిని చూడగానే నిందితులు పారిపోయారు. కింద పడి ఉన్న కాశన్నను చికిత్స నిమిత్తం నిర్మల్ లోని దేవేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించగా, కడుపులో చిన్న పేగు దెబ్బతిన్నట్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతున్న కాశన్న, తేది: 18-07-2026 మధ్యాహ్నం 1:45 గంటలకు దేవేందర్ రెడ్డి ఆసుపత్రిలో మృతి చెందాడు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
నిందితులైన శివరాత్రి ధర్మరాజు, అతని స్నేహితులను సారంగాపూర్ గ్రామంలో నిర్మల్ గ్రామీణ సీఐ కృష్ణ పర్యవేక్షణలో సారంగాపూర్ పోలీసు సిబ్బంది అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మల్ డిఎస్పీ, గ్రామీణ సీఐ, పోలీసు సిబ్బందిని అభినందించారు.











