శంభాజీనగర్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 23
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటనలో, తల్లిదండ్రులతో పాటు ఒక కొడుకు లోయలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది.
మహారాష్ట్రలోని శంభాజీనగర్‌లో జరిగిన ఒక హృదయవిదారక ఘటనలో, తల్లిదండ్రులతో పాటు ఒక కొడుకు లోయలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో తీవ్ర కలకలం రేగింది. నేటి యువతలో పెరుగుతున్న నిర్లక్ష్యం, తల్లిదండ్రుల మాట వినకపోవడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందిస్తూ, ఆలోచనా శక్తిని కోల్పోతున్నారని పలు సంఘటనలు తెలియజేస్తున్నాయి. పెరిగిన స్వేచ్ఛ, చెడు స్నేహాలు, అలవాట్లు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తల్లి వేడుకోలు
వివరాల్లోకి వెళితే, లోయ అంచున ఉన్న కొడుకుని వెనక్కి రమ్మని, నీకోసం నా మంగళసూత్రాన్ని కూడా అమ్ముతాను, మీ నాన్నను వదిలేసి నీతోనే ఉంటాను, నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళకు అని తల్లి కన్నీటితో వేడుకుంది. కొడుకు ఐఫోన్ కొనేందుకు మంగళసూత్రాన్ని అమ్మేయాలని కోరినట్లుగా, తల్లి తన చివరి ప్రయత్నంగా ఆవేదన వ్యక్తం చేసింది.
తీవ్ర విషాదం
అయినప్పటికీ, కొడుకు తల్లి మాట వినకపోవడంతో, చివరికి తల్లిదండ్రులు, కొడుకు ముగ్గురూ లోయలో దూకి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి సంఘటనలు యువత మానసిక స్థితిపై, కుటుంబ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












