Maharashtra, 2026-07-15
మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో కల్తీ పాల రాకెట్ గుట్టు రట్టయింది. కేవలం ఆరు నెలల్లో 2,30,470 కిలోల నాసిరకం పాలపొడితో 2.3 కోట్ల లీటర్ల సింథటిక్ పాలు తయారు చేసి, రూ.9.21 కోట్ల విలువైన అమ్మకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఏడుగురిపై కేసు నమోదైంది.
డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్రలోని ధారాశివ్ జిల్లా భూమ్ తాలూకాలో కల్తీ పాల రాకెట్ గుట్టు రట్టయింది. కేవలం ఆరు నెలల్లో 2,30,470 కిలోల నాసిరకం పాలపొడితో 2.3 కోట్ల లీటర్ల మేర సింథటిక్ పాలు తయారు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ అక్షరాల రూ.9.21 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
ప్రతి 100 లీటర్ల స్వచ్ఛమైన పాలలో.. 10 లీటర్ల సింథటిక్ పాలు కలిపి విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. నిర్మా డిటర్జెంట్ పౌడర్ సహా పామాయిల్, నాసిరకం రసాయనాలతో కల్తీ పాలు తయారు చేసినట్లు నిర్ధారించారు.
ఈ వ్యవహారంలో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అంతా పరారీలో ఉండగా, వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.












