హైదరాబాద్, 2026-08-18
హైదరాబాద్లోని పీర్జాదిగూడలో భర్తను భార్య హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చేతులు, కాళ్లు కట్టేసి సెంట్రింగ్ కర్రతో కొట్టి చంపిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో దారుణ హత్య జరిగింది. భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రాఘవేంద్ర కాలనీకి చెందిన సత్యనారాయణ (51), ఆయన భార్య సునీత (44) మధ్య ఆగస్టు 6న ఇంట్లో గొడవ జరిగింది.
ఈ క్రమంలో సునీత తన భర్త చేతులు, కాళ్లను చీరతో కట్టేసి, సెంట్రింగ్ కర్రతో తీవ్రంగా కొట్టింది. అనంతరం, వాహనం నుంచి జారిపడి గాయపడ్డాడని కుమారుడికి చెప్పింది. ఆసుపత్రికి తరలించగా సత్యనారాయణ మృతి చెందాడు.
ప్రమాదంపై అనుమానం వచ్చిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. విచారణలో భార్య సునీత అసలు నిజం ఒప్పుకోవడంతో ఆమెను అరెస్ట్ చేశారు.












