న్యూఢిల్లీ, 2026-08-17
దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై మొత్తం 4,192 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. వీరిపై ఉన్న క్రిమినల్ కేసుల సత్వర విచారణపై అమికస్ క్యూరీ తాజాగా సుప్రీంకోర్టుకు 22వ నివేదికను సమర్పించారు.

కేసుల వారీగా వివరాలు
ఈ నివేదికలోని వివరాల ప్రకారం, పదేళ్లకు పైగా 519 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 5 నుంచి 10 ఏళ్ల మధ్య 754 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. సిట్టింగ్ ఎంపీలపై 335 కేసులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై 1,222 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మాజీ ఎంపీలపై 269 కేసులు, మాజీ ఎమ్మెల్యేలపై 1,339 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
దర్యాప్తులో ఉన్న కేసులు
మరో 700 కేసుల దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, 360 కేసులు మూడేళ్లకు పైగా దర్యాప్తులో ఉన్నాయని అమికస్ క్యూరీ నివేదికలో పేర్కొన్నారు.
ఎడిఆర్ నివేదిక
లోక్‌సభలోని 543 మంది సభ్యుల్లో 251 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎడిఆర్) సంస్థ నివేదిక వెల్లడించింది.