హైదరాబాద్, 4 July
హైదరాబాద్‌లోని బాచుపల్లిలో భార్యను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మద్యం అలవాటున్న భర్త, తరచూ భార్యతో గొడవపడి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
బాచుపల్లి పరిధిలో భార్యను హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలకృష్ణ, తరచూ మద్యం సేవించి భార్య భార్గవి (35)తో గొడవపడేవాడు.
గత నెల 20న ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, బాలకృష్ణ భార్గవి గొంతు నులిమి, తలను గోడకు బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం, చీరతో ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు బాలకృష్ణ నేరాన్ని అంగీకరించడంతో, హత్య కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.












