హైదరాబాద్, 10 July
గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో లోన్ తీసుకున్న మహిళకు చెందిన సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు మాయమైన ఘటనలో, మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలకృష్ణ, అతని కుమారుడు నిఖిల్, ఫైనాన్స్ సంస్థ మేనేజర్ సంధ్యారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ యూసుఫ్ గూడలో చోటుచేసుకుంది.
గోల్డ్ ఫైనాన్స్ సంస్థల్లో లోన్ తీసుకున్న మహిళకు చెందిన సుమారు 30 తులాల బంగారు ఆభరణాలు మాయమైన ఘటనలో, మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలకృష్ణ, అతని కుమారుడు నిఖిల్, ఫైనాన్స్ సంస్థ మేనేజర్ సంధ్యారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ యూసుఫ్ గూడకు చెందిన శ్రీలత చంద్రశేఖర్ దంపతులకు బాలకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడతానని నమ్మించి, శ్రీలతను నమ్మించాడు. బాలకృష్ణ మాటలు నమ్మిన శ్రీలత, కోసమట్టం ఫైనాన్స్ సంస్థల నుంచి తన 30 తులాల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి సుమారు 18 లక్షల రూపాయలు లోన్ తీసుకుంది.
ఈ డబ్బును పెట్టుబడి పేరుతో బాలకృష్ణకు బదిలీ చేసింది. అయితే, పెట్టుబడి పేరుతో డబ్బు తీసుకోవడమే కాకుండా, తనకా పెట్టిన బంగారు ఆభరణాలను కూడా బాలకృష్ణ కాజేశాడు. కోసమట్టం ఫైనాన్స్ మేనేజర్‌తో కుమ్మక్కై తనను మోసం చేశాడని శ్రీలత పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేసి, బాలకృష్ణ, అతని కుమారుడు నిఖిల్, మేనేజర్ సంధ్యారాణిని అరెస్ట్ చేశారు.












