చిత్తూరు, 17 July
ఏకంతనికి అడడుగ ఉననడని.. ియుడితో కలిసి కుముడిై కననతలలి కూంగ దడి చేసిన ఘటన చితతూు జిలలలో చోర్ట్ పై దాడిచేసుకుంది. ియుడి కోిక మేకు, తమ ఏకంతనికి ఆటంకంగ ఉననడని ఏడేళల బలుడిై నిదకషిణయంగ దడి చేసి, బలేడుతో శీంై గయిచింది. ఈ దుణం సభయసమజం తలదించుకునేల చేసతోంది.
ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడని.. ప్రియుడితో కలిసి కుమారుడిపై కన్నతల్లి దాష్టీకం ప్రదర్శించింది. ప్రియుడి కోరిక మేరకు, తమ ఏకాంతానికి ఆటంకంగా ఉన్నాడని ఏడేళ్ల బాలుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి చేసి, బ్లేడుతో శరీరంపై గాయపరిచింది. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ మహిళకు ఏడేళ్ల కొడుకు ఉన్నాడు. భర్త మరణించడంతో తల్లీకొడుకులు కలిసి జీవిస్తున్నారు. ఈ క్రమంలో రాజు అనే వ్యక్తితో మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది. రాజు తరచూ మహిళ ఇంటికి వచ్చి ఆమెతో ఏకాంతంగా గడిపేవాడు. అయితే, వారి ఏకాంతానికి ఏడేళ్ల బాలుడు అడ్డుగా ఉన్నాడని రాజు భావించాడు. ఈ విషయాన్ని మహిళకు చెప్పడంతో, బాలుడిని ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేస్తే ఇద్దరం ఇబ్బంది లేకుండా ఉండొచ్చని మాట్లాడుకున్నారు.
దీంతో, తల్లి, ఆమె ప్రియుడు కలిసి బాలుడిని చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించారు. శుక్రవారం రోజున వీరిద్దరూ కలిసి బాలుడిపై దాడి చేశారు. బ్లేడుతో బాలుడి శరీరాన్ని ఇష్టమొచ్చినట్లు గాయపరిచారు. చివరకు బాలుడి ప్రైవేట్ పార్ట్ మీద కూడా బ్లేడుతో గాయం చేశారు. వీరి వేధింపులను తట్టుకోలేని బాలుడు గట్టిగా కేకలు వేయడంతో.. ఇరుగుపొరుగు జనం అక్కడికి చేరుకున్నారు.
రక్తగాయాలతో ఉన్న చిన్నారిని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రియుడి మోజులో పడి కన్నతల్లి అయిన సంగతి మరిచి, కొడుకుపైనే దాడి చేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.












