బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మొక్కలు నాటారు. వై.ఎస్.ఆర్. వీరాభిమాని అల్లం మనోహర్, వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డితో కలిసి ఆసుపత్రి ఆవరణలో పూల మొక్కలను నాటారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండల కేంద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మొక్కలు నాటారు.
వై.ఎస్.ఆర్. వీరాభిమాని అల్లం మనోహర్, వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డితో కలిసి ఆసుపత్రి ఆవరణలో పూల మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా అల్లం మనోహర్ మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆరోగ్యశ్రీ, అత్యవసర అంబులెన్స్ సేవలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, మహిళల స్వయం సాధికారతకు పావలా వడ్డీ రుణాలు, రైతులకు రుణమాఫీ వంటి పథకాలు ఆయన దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ నవీన్ రెడ్డి, సిబ్బంది జ్యోతి, కవిత, సౌజన్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.











