కుప్టి గ్రామానికి చెందిన రామచంద్ర కామాజీ క్షీర్ సాగర్ గారి మొదటి వర్థంతిని పురస్కరించుకుని, ఆయన స్మృతి చిహ్నంగా గ్రామంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
మనోరంజని తెలుగు టైమ్స్ (తానూర్): మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన రామచంద్ర కామాజీ క్షీర్ సాగర్ గారి మొదటి వర్థంతిని ఆయన స్వగ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జ్ఞాపకార్థం, ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందేలా గ్రామంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు.
విగ్రహ స్థాపనకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయనకు పలువురు నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామచంద్ర కామాజీ క్షీర్ సాగర్ విద్యా, వృత్తి జీవిత విశేషాలను గుర్తుచేసుకున్నారు.
ఆయన ఔరంగాబాద్‌లోని మిలింద్ విశ్వవిద్యాలయంలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేసి, ఎందరో విద్యార్థుల జీవితాల్లో విద్యా వెలుగులు నింపారని, జ్ఞానాన్ని పంచడంలో ఆయనది ప్రత్యేక స్థానమని పలువురు ప్రశంసించారు. ఆయన ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి గోదావరి, కుమారులు దీపక్, అభిలాష్, కుమార్తెలు మంగళ్ తాయి, స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.











