మాడ్గులపల్లి మండలంలోని ఇస్కబావిగూడెం గ్రామంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, విగ్రహ ఆవిష్కరణ కమిటీ సభ్యులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు కట్టా అనంతరెడ్డిని ఘనంగా సన్మానించారు.
అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కట్టా అనంతరెడ్డిని శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయనకు మాడ్గులపల్లి మండల విలేకరులు పూల బోకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.
కట్టా అనంతరెడ్డి మాట్లాడుతూ, డా. బి.ఆర్. అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి ఎంతో గొప్పదని, ఆయన ఆశయ సాధనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల విలేకరులు షేక్ మౌలాలి, సురేందర్, దర్శనం రాంబాబు, రవి, చిట్యాల సైదులు, శ్రవణ్, బొంగర్ల శ్రీను, పెరుమళ్ల భరత్ తో పాటు అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.











