ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తికి, బంధువులు ముందుకు రాకపోవడంతో 'మే ఐ హెల్ప్ యు' ఫౌండేషన్ సభ్యులు మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహించారు.
ఆసుపత్రి సిబ్బంది సమాచారం మేరకు ఫౌండేషన్ టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ వెంటనే స్పందించి, సోమవారం హిందూ స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, అహమ్మద్ హుస్సేన్, నరేంద్ర కుమార్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు మాట్లాడుతూ, సమాజంలో ఒంటరిగా ఉన్నవారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం తమ ఫౌండేషన్ నిరంతర కర్తవ్యమని పేర్కొన్నారు.
అంతేకాకుండా, శ్రీ అమ్మ శరణాలయంలో ఉన్న వృద్ధులకు సహాయం చేయాలనుకునే దాతలు 82972 53484, 9182244150 నంబర్లలో సంప్రదించాలని ఫౌండేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.












