లోకేశ్వరం, జూలై 01
నిర్మల్ జిల్లా రాజురా గ్రామ పంచాయతీలో 10 పారిశుద్ధ్య కార్మికులకు నూనె ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ నిర్వహించింది.
స్వచ్ఛత సేవాకార్యక్రమాల్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు సహాయం అందించారు. నిర్మల్ జిల్లా రాజురా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న 10 మంది పారిశుద్ధ్య కార్మికులకు నూనె ప్యాకెట్లను పంపిణీ చేశారు. గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీఏపీయూఎస్ జిల్లా కార్యదర్శి రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ ముత్తాగౌడ్, పంచాయతీ కార్యదర్శి మహేష్, యువ నేత యూత్ సభ్యులు నరేష్, రమణ, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారికి సహకారం అందించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.











