నిర్మల్ పట్టణంలో ఉద్యోగ జీవితం నుంచి పదవీ విరమణ చేసిన లక్కాకుల నవీన్ కు శనివారం కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆత్మీయ సన్మాన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్ననాటి మిత్రులు హాజరై నవీన్ దంపతులను సత్కరించారు.
చిన్ననాటి మిత్రులు నవీన్ దంపతులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో సురేందర్, రామువర్మ, సాయిరెడ్డి, శ్రీనివాస్, రవీందర్, జ్యోతి, అనిత పాల్గొన్నారు. అదేవిధంగా, సర్పంచ్ గా ఎన్నికైన తోటి మిత్రుడు సాయిరెడ్డిని కూడా సన్మానించారు.
ఈ సందర్భంగా నవీన్ ను కొనియాడుతూ, ఆయన సుదీర్ఘకాలం నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారని మిత్రులు తెలిపారు. కార్యాలయంలో తోటి ఉద్యోగులతో కలిసి మెలిసి పనిచేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
పదవీ విరమణ అనంతరం నవీన్ తన కుటుంబంతో ఆనందంగా గడపాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమానికి బంధువులు కూడా హాజరై నవీన్ కు అభినందనలు తెలిపారు.











