ప్రొద్దుటూరు, జూలై 14
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన గుర్తుతెలియని వ్యక్తికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది సంప్రదించడంతో ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి హిందూ స్మశానవాటికలో గౌరవప్రదంగా అంత్యక్రియలు పూర్తి చేశారు.
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన గుర్తుతెలియని వ్యక్తికి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ సభ్యులు మానవత్వాన్ని చాటుతూ హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
ఆసుపత్రి మార్చురీలో మృతదేహం ఉండగా, అంతిమ సంస్కారాల కోసం ఎవరూ రాకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ అధ్యక్షుడు సుబాహన్ను సంప్రదించారు. సమాచారం అందుకున్న ఫౌండేషన్ సభ్యులు వెంటనే స్పందించి హిందూ స్మశానవాటికలో గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు, టౌన్ అధ్యక్షుడు సుబాహన్, అహమ్మద్ హుస్సేన్, ఈశ్వర్ వర్ధన్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ మోరే లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, సమాజంలో ఎవరూ లేని వారికి కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతోందని తెలిపారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని చెప్పారు.
అలాగే, శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధుల సంక్షేమానికి సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 91822 44150 నంబర్లను సంప్రదించాలని ఫౌండేషన్ సభ్యులు కోరారు.












