ఖానాపూర్, 2026-08-09
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖానాపూర్ పట్టణంలో ఆదివాసులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆదివాసీలతో కలిసి ర్యాలీగా తెలంగాణ తల్లి చౌరస్తా వరకు వెళ్లి, అక్కడ జండా ఆవిష్కరణ చేశారు.
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖానాపూర్ పట్టణంలో ఆదివాసులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆదివాసీలతో కలిసి ర్యాలీగా తెలంగాణ తల్లి చౌరస్తా వరకు వెళ్లి, అక్కడ జండా ఆవిష్కరణ చేశారు. ఆదివాసి ఐక్యతను చాటుతూ జల్, జంగల్, జమీన్, హమారా హాయ్ నినాదాలు చేశారు. కొమరం భీంకు జోహార్లు అర్పిస్తూ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో ఏఐకేమ్స్ జిల్లా అధ్యక్షులు నందిరామయ్య, బిఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ రాజా గంగన్న, గిరిజన నాయకులు, పలువురు ఆదివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలపై చర్చించారు. ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.












