హైదరాబాద్, జూలై 13
ేసీఐ ఇడా ోన్-12 "తేస్ మడ్కాన్–2026" కార్క్రమలో ేసీఐ నర్మల్ స్పూర్త అద్భుత ప్రతభ కనబరచ మొత్త ఎనమద ప్రతష్టాత్మక అార్డులను సొత చేసుకుద. ఈ తో నర్మల్ ల్లాకు ాతీ స్థాలో గుర్తపు లభచద. సస్థ నర్హచన సేా కార్క్రమాలు, ్క్తత్ కాస శక్షణలు, నాకత్ అభృద్ధ కార్క్రమాలకు గాను అనేక భాగాల్లో అార్డులు దక్కా.
హైదరాబాద్లోని కత్రియ హోటల్ సోమాజిగూడలో ఘనంగా నిర్వహించిన జేసీఐ ఇండియా జోన్-12 "తేజస్ మిడ్కాన్–2026"లో జేసీఐ నిర్మల్ స్పూర్తి విశేష ప్రతిభ కనబరిచి, మొత్తం ఎనిమిది ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకుంది. ఈ విజయంతో నిర్మల్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
సంస్థ నిర్వహించిన సేవా కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాస శిక్షణలు, నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలకు గుర్తింపుగా "ఉత్తమ స్థానిక వ్యక్తిగత వికాస (ఐడీ) కార్యక్రమం" విభాగంలో విజేత (Winner) అవార్డును జేసీఐ నిర్మల్ స్పూర్తి అందుకుంది.
వ్యక్తిగత విభాగాల్లో జేసీ వాడేకర్ లక్ష్మణ్ ఉత్తమ స్థానిక సంస్థ అధ్యక్షుడు విభాగంలో రన్నరప్, జేసీ డాక్టర్ సురేష్ అల్లాడి ఉత్తమ జేసీఐ సభ్యుడు విభాగంలో రన్నరప్, జేసీ సోనియా రాణి ఉత్తమ నూతన మహిళా జేసీఐ సభ్యురాలు విభాగంలో రన్నరప్, జేసీ జాధవ్ అమిత్ నాయక్ ఉత్తమ స్థానిక సంస్థ అధికారి విభాగంలో రన్నరప్ అవార్డులను గెలుచుకున్నారు.
జేసీఐ నిర్మల్ స్పూర్తి వ్యవస్థాపక అధ్యక్షుడు జేసీ వాడేకర్ లక్ష్మణ్ గారికి సంస్థ అభివృద్ధి, సేవా కార్యక్రమాలు, నాయకత్వంలో చూపిన విశేష కృషికి గాను జోన్ వైస్ ప్రెసిడెంట్ స్పెషల్ రికగ్నిషన్ అవార్డు లభించింది. ఈ అవార్డులతో కలిపి మొత్తం ఎనిమిది అవార్డులను జేసీఐ నిర్మల్ స్పూర్తి కైవసం చేసుకుంది.
ఈ సందర్భంగా జేసీఐ ఇండియా జోన్-12 అధ్యక్షులు జేఎఫ్ఎస్ గౌతమ్ కుమార్ జైన్, రీజియన్–బి జోన్ వైస్ ప్రెసిడెంట్ జేఎఫ్ఎం మహేందర్ గుండం జేసీఐ నిర్మల్ స్పూర్తి సభ్యులను అభినందిస్తూ, వారి సేవా కార్యక్రమాలు ఇతర స్థానిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.
ఈ విజయంపై జేసీఐ నిర్మల్ స్పూర్తి వ్యవస్థాపక అధ్యక్షుడు జేసీ వాడేకర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, నిరంతరం మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించిన జేఎఫ్ఎస్ గౌతమ్ కుమార్ జైన్, జేఎఫ్ఎం మహేందర్ గుండంలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యదర్శి జేసీ డి. విశ్వశ్రీ, కోశాధికారి జేసీ దుగ్గె అనిల్, లోకల్ గవర్నింగ్ బోర్డు (ఎల్జీబీ) సభ్యులు, కార్యవర్గ సభ్యులు, ప్రతి జేసీ సభ్యుని సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. అందరి సమిష్టి కృషి, సేవాభావం, అంకితభావం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
భవిష్యత్తులోనూ సమాజ సేవ, యువత నాయకత్వ వికాసం, వ్యక్తిత్వాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తూ జేసీఐ నిర్మల్ స్పూర్తిని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్నత స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ ఘన విజయంపై జిల్లా వ్యాప్తంగా జేసీఐ సభ్యులు, సామాజిక ప్రముఖులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ విజేతలను అభినందించారు.












