Nirmal/Tanur (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 01
సామాజిక చైతన్యం, శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణకు పాటుపడిన డాక్టర్ అన్నాభావూ సాఠే ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని బోసి గ్రామ సర్పంచ్ పసుల సాగర నాగనాథ్ పిలుపునిచ్చారు. తానూర్ మండలంలోని బోసి గ్రామంలో శనివారం ఆయన 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సామాజిక చైతన్యానికి, శ్రామిక వర్గాల హక్కుల పరిరక్షణకు తన సాహిత్యంతో విశేష సేవలందించిన మహనీయుడు డాక్టర్ అన్నాభావూ సాఠే అని బోసి గ్రామ సర్పంచ్ పసుల సాగర నాగనాథ్ అన్నారు. తానూర్ మండలంలోని బోసి గ్రామంలో శనివారం డాక్టర్ అన్నాభావూ సాఠే 106వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ పసుల సాగర నాగ్నాథ్ సాఠే జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మణ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జెండాను ఆవిష్కరించారు. తర్వాత అన్నాభావూ సాఠే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, అన్నాభావూ సాఠే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సామాజిక సమానత్వం, న్యాయం, శ్రామికుల సంక్షేమం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి జాదవ్ గోపీనాథ్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రోగల్ బాలాజీ, మాజీ మండల ప్రాదేశిక సభ్యుడు శంకర్ లాచారం గాడే, మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యుడు ఉత్తం భలేరావు ప్రసాద్, కమిటీ ప్రతినిధులు సాయినాథ్, గంగాధర్, కమల్, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.












