రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 1
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో శనివారం ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలను శ్రీ రాజరాజేశ్వర ఆటో యూనియన్ ఘనంగా నిర్వహించింది. యూనియన్ అధ్యక్షుడు ఎడపల్లి అంజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి, ప్రయాణికులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో శనివారం ఆటో డ్రైవర్ల దినోత్సవ వేడుకలను శ్రీ రాజరాజేశ్వర ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షుడు ఎడపల్లి అంజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు అరటిపండ్లు, స్వీట్లు పంపిణీ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎడపల్లి అంజయ్య మాట్లాడుతూ, రాత్రి–పగలు అనే తేడా లేకుండా ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆటో డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. సమాజ సేవలో ఆటో డ్రైవర్ల సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు కన్నం సురేష్, నాయకులు ఎడపల్లి శ్రీరాములు, మనోహర్, శ్రీనివాస్, సుమన్, పులి చంద్రయ్య, సురేష్, శేఖర్, తాజ్, ఎర్ర రవి, పంగ రవి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.












