
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్లుగా నిలిచిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్, కుంటాల విద్యార్థినులను నిర్మల్ జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా, డీఈఓ భోజన్న ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్లుగా నిలిచిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్, కుంటాల విద్యార్థినులను నిర్మల్ జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా, డీఈఓ భోజన్న ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.

తమిళనాడులోని చెన్నై నుండి ప్రారంభమైన రాజీవ్ మెమోరియల్ జ్యోతి యాత్రకు ఆదివారం నిజామాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్‌పల్లి గ్రామంలో ఆదివారం జరిగిన మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి తల్లి పెద్దోళ్ల సాయమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావుతో పాటు పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు హాజరయ్యారు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆపిసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరోగ్య వైద్య సేవా కార్యక్రమం ప్రజల మన్ననలు పొందింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు, క్లబ్ చేస్తున్న సేవలను ప్రశంసించారు.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్‌పల్లి గ్రామంలో ఆదివారం జరిగిన మాజీ ఎంపీపీ గిర్దావర్ గంగారెడ్డి తల్లి పెద్దోళ్ల సాయమ్మ పెద్దకర్మ కార్యక్రమానికి మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావు హాజరై, సాయమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.

కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 99 రోజుల యాక్షన్ ప్లాన్ – ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా విజయోత్సవ వేడుకల్లో భాగంగా, IPE-2026లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, విశిష్ట ప్రతిభ కనబరిచిన అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.

పదేళ్లు మంత్రిగా ఉన్నా నిర్మల్ అభివృద్ధికి ఏమీ చేయలేదని, స్థానిక ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కరిపే విలాస్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

నిర్మల్ డిపో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టి. ఎం.యు.) కార్యవర్గ ఎన్నిక ఆదివారం నాడు నిర్వహించబడింది. ఈ ఎన్నికలో కె. హన్మంతు డిపో అధ్యక్షులుగా, పి. నారాయణ సెక్రటరిగా ఎన్నికయ్యారు.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండల పరిధిలోని శివపురం ప్రాంతంలో ఇంట్లో చొరబడి సుమారు 6 తులాలకు పైగా బంగారు ఆభరణాలను దొంగిలించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కుబీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం 'విద్య విజయోత్సవం' పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్ అందజేశారు.

కుబీర్ మండలంలోని హంపోలి (బి) గ్రామంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.39.50 లక్షల నిధులతో చేపట్టనున్న చెరువు మరమ్మత్తుల పనులకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ పనులు పూర్తయితే సాగునీటి సమస్యలు తీరడంతో పాటు పంటల ఉత్పత్తి పెరుగుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం శ్రీ సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో సాయి పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు, హారతి కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై భక్తిలో మునిగిపోయారు.

కుంటాల మండల కేంద్రంలో సహకార సంఘం సీఈఓగా పదోన్నతి పొందిన కొత్తకాపు మహేష్‌ను నాగార్జున సాగర్ పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. 2007 & 2009 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం 'Naavaa' ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

తెలంగాణ రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో, మార్కెట్ కమిటీ ఇచ్చోడ సహకారంతో మర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు.

తమ నియోజకవర్గంలోని మారుమూల ప్రాంతాల ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించే లక్ష్యంతో, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో కొత్త బస్సు సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. మొత్తం 11 కొత్త బస్సులు మంజూరు చేయబడ్డాయి.

కుంటాల మండల కేంద్రంలోని గజ్జలమ్మ దేవి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కోరికలు తీర్చే కల్పవృక్షంగా భావించే అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

జిల్లా కేంద్రంలో భూ కబ్జాలు, నకిలీ పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో మాజీ కౌన్సిలర్ భార్యతో సహా పలువురిని అరెస్ట్ చేశారు.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారికి తగిన గౌరవం కల్పించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ అభినందించింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ కడల గంగా నరసయ్య, కోఆర్డినేటర్ భూక్య గోవింద్ నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు.