
నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని మామడ మండలం వాస్తాపూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు బూత్ స్థాయి ఏజెంట్ల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఓటరు జాబితా పరిశీలన, ఇంటింటి ఓటరు ధ్రువీకరణ, కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో మార్పులు చేర్పులపై పలు సూచనలు చేశారు.



















