
నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి గ్రామంలోని పోచమ్మ ఆలయం సమీపంలో రూ.90 లక్షల కేంద్ర నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజి నిర్మాణ పనులను శనివారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పనుల వల్ల ఆలయానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


















