
రానున్న పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సోన్ మండలంలోని పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన, ఘాట్ల వద్ద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.



















