
బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'తొలిముద్ద' పౌష్టికాహార కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కొమరం లలిత మాట్లాడుతూ, పిల్లల ఎదుగుదలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.



















