బీడీ పరిశ్రమ యాజమాన్య సంఘంతో టేకేదారుల చర్చలు ఫలప్రదంగా జరిగాయి.
ఈ సమావేశంలో బీడీ కమీషన్ దారుల కమిషన్ రేటును రూ.6 పెంచాలని నిర్ణయించారు. గతంలో రూ.22.60గా ఉన్న కమిషన్ను ఇప్పుడు రూ.28.60కు పెంచారు.
ఈ పెరిగిన రేటు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.
టేకేదారులు ఐక్యతతో కొనసాగాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం. హరిత కోరారు.












