రామడుగు, 4 September
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహించే టీ, టిఫిన్, మీల్స్, స్నాక్స్ క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు.
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో నిర్వహించే టీ, టిఫిన్స్, మీల్స్, స్నాక్స్ క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ఇందిరా మహిళా శక్తి పథకం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించి కుటుంబ, సామాజిక అభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీశ్, తహసీల్దార్ రాజమల్లయ్య, ఎస్ఐ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మర వేణి, తిరుమల తిరుపతి సింగిల్ విండో చైర్మన్ కోల రమేష్, ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్, సర్పంచులు గుమ్మడి మల్లేశం, ఓంప్రకాష్, అనంతరెడ్డి, మొయిజ్, మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజమ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.












