Jagithyal, 13 July
పభవం నివహిసనన జీయ ని నిూన కయకంో భగంగ ఒడయడ గంో నివణ పంపిణీ జిగింది. ఈ కయకంో గ అవసరం - సపంచబొెనపశం పగొని, పి ఆోగయనికి ని నివణ పఖయన వివించ.
గ్రామ ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఒడ్యాడ్ గ్రామంలో అల్బెండాజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మెన ప్రశాంత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు నులిపురుగుల నివారణ అత్యంత అవసరమని, ప్రతి అర్హులైన బాలబాలికలు తప్పనిసరిగా అల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన గ్రామ నిర్మాణంలో ప్రతి కుటుంబం భాగస్వాములు కావాలని, ఆరోగ్య శాఖ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
"ఆరోగ్యవంతమైన పిల్లలే బలమైన సమాజానికి పునాది" అనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.












