నిర్మల్, శుక్రవారం
నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ పరిధిలో గల తన్వి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. కత్తులతో బెదిరించి, రెండు ఫ్లాట్లలోని నివాసితుల వద్ద నుంచి 20 తులాల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ పరిధిలో గల తన్వి అపార్ట్మెంట్లో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. అపార్ట్మెంట్లోని రెండు ఫ్లాట్లలోకి చొరబడిన దుండగులు, అక్కడి నివాసితులను కత్తులతో బెదిరించి, వారి వద్దనున్న 20 తులాల వెండి, రెండు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ శ్రీనివాస్, సీఐ సమ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో కలిసి దొంగలు తప్పించుకున్న మార్గాలపై ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.











