నేటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలకు హాజరవుతున్న నిర్మల్ జిల్లా విద్యార్థులందరికీ ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనవకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. క్రమశిక్షణతో చదివి ఉన్నతమైన ఫలితాలు సాధించి జిల్లా, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకుని ప్రశాంతమైన మనసుతో సమాధానాలు రాయాలని కోరుతూ, అన్ని విద్యార్థులకు “ఆల్ ది బెస్ట్” తెలిపారు.


