కాల్వ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 28
నిర్మల్ తెగిపడి ఉన్న జిల్లా దిలవర్ పూర్ మండలం కాల్వ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెగిపడి ఉన్న విద్యుత్ తీగలకు నాలుగు గొర్రెలు, రెండు మేకపోతులు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. మృతుల విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని పశువుల యజమాని తెలిపారు.
నిర్మల్ జిల్లా దిలవర్ పూర్ మండలం కాల్వ గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం తెగిపడి ఉన్న విద్యుత్ తీగలకు నాలుగు గొర్రెలు, రెండు మేకపోతులు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. మృతుల విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని పశువుల యజమాని తెలిపారు.
కాల్వ గ్రామానికి చెందిన కురుమే దేవన్నకు సుమారు 160 నుండి 170 గొర్రెలు ఉన్నాయి. రోజూలాగానే గురువారం ఉదయం 10 గంటల సమయంలో తన గొర్రెల మందను మేత కోసం తీసుకువెళ్లారు. అయితే, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో శనిగరపు భూమన్న అనే వ్యక్తి తన తోట పక్కన తెగిపడి ఉన్న విద్యుత్ తీగలకు గొర్రెలు, మేకలు తగలడంతో అవి మృతి చెందాయి.
పశువులు విద్యుత్ తీగలకు తగలగానే దేవన్న వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, తెగిపడి ఉన్న తీగలను తొలగించారు. మృతి చెందిన పశువులను పంచనామా చేసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని, దేవన్నకు తగిన నష్టపరిహారం అందిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.












