మెట్టుపల్లి (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 03
మెట్టుపల్లి పట్టణంలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు పడి షేరు గంగ (30) అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మెట్టుపల్లి పట్టణంలో సోమవారం ఎస్సారెస్పీ కాలువలో ప్రమాదవశాత్తు పడి షేరు గంగ (30) అనే యువకుడు మృతి చెందాడు. డి.డి. నగర్ కు చెందిన షేరు గంగ కాలువలో పడిపోగా, స్థానికులు గుర్తించి బయటకు తీసేలోపే ప్రాణాలు విడిచాడు.
పోలీసుల పరిశీలన
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.












