Nirmal/Mamda (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 27
మామడ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాణావత్ అంబాజీ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. రాయదారి మెయిన్ రోడ్డుపై సోమవారం బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ఘటనలో అంబాజీ ముఖంతో పాటు చేతికి, కాలికి గాయాలయ్యాయి.
మామడ మండలంలోని రాయదారి మెయిన్ రోడ్డుపై సోమవారం బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. బాణావత్ అంబాజీ (40) బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్క అడ్డుగా రావడంతో బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో అంబాజీ ముఖానికి తీవ్ర గాయాలతో పాటు చేతికి, కాలికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ సురేష్, పైలెట్ విజయ్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం చేర్పించారు.












