కుబీర్, 2026-06-05
కుబీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ప్రయాణికుల జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామానికి చెందిన కొందరు ఈరోజు తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న జీపు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మరణించగా, ఆసుపత్రికి తరలించిన తర్వాత మరొక వ్యక్తి మరణించాడు. మరికొందరికి తీవ్ర గాయాలు, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు శ్రీ జి విట్టల్ రెడ్డి, బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి, మూడు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు.











