నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని ధర్మోర గ్రామంలో పిడుగుపాటుకు ఒక ఆవు మృతి చెందింది. ఈ సంఘటనతో రైతు మామిడి సంజీవరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం సాయంత్రం ఈదురు గాలులు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో, రైతు మామిడి సంజీవరెడ్డి తన ఆవును గోదావరి పరివాహక ప్రాంతం నుండి ఇంటికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
పిడుగుపాటుకు గురైన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఆవు విలువ సుమారు 55 వేల రూపాయలు ఉంటుందని రైతు తెలిపారు.
ప్రభుత్వం తమను ఆదుకుని, ఆర్థిక సహాయం అందించాలని బాధిత రైతు ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించే అవకాశం ఉంది.










