పార్డి (బి) గ్రామానికి చెందిన నలుగురు జీపు బోల్తా పడి మృతి చెందడంతో పాటు ఏడుగురికి తీవ్ర గాయాలు కావడంతో, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోస్టుమార్టం గదిలో మృతదేహాలను పరిశీలించి, జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని చెబుతూ, బాధితులను ఓదార్చారు.
గాయపడిన వారికి ఎమ్మెల్యే పరామర్శ
అనంతరం డాక్టర్ ప్రీతం, బైంసా ఏరియా ఆసుపత్రి, జిడిఆర్ హాస్పిటల్, వెంకటేశ్వర హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే సూచించారు.











