మెట్పల్లి, జూలై 29
మెట్టుపల్లిలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేరింది. ఈ నేపథ్యంలో పుర కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో నీటిని బయటకు పంపించేలా చర్యలు చేపట్టారు.
మెట్టుపల్లిలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ఇందిరా ప్రియదర్శిని కాలనీలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి వరద నీరు భారీగా చేరింది. దీంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పుర కమిషనర్ శ్రీనివాస్ గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వెంటనే జేసీబీ సహాయంతో నీరు బయటకు వెళ్లేలా మార్గం ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. అధికారుల తక్షణ స్పందనతో వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే అధికారులకు సమాచారం అందించాలని పుర అధికారులు సూచించారు.












