మెండోరా (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 23
మెండోరా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత 15 రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ప్రజలు ఊరట చెందారు.

రైతుల సంతోషం
వర్షం కారణంగా పలు పంటలకు ఎంతో మేలు జరిగిందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పంటలకు అవసరమైన తేమ అందడంతో మరో వారం రోజుల పాటు నీటి అవసరం తగ్గుతుందని రైతులు పేర్కొన్నారు. వర్షం మరింత కురిస్తే పంటలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.