కడం (పెద్దూర్), 2026-07-31
కడమడోమెగూడెగమోఅకవకణగకోయయణకచెదపూగకూపోయద.ోఉకబయమదగేబయకవెళడోపణపపద.అయే,బవ,వోహగృహోపకణధవమైవద.
కడం మండలంలోని మెట్టిగూడెం గ్రామంలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి కోల సత్యనారాయణకు చెందిన ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ముందుగానే బయటకు వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, బీరువా, టీవీతో పాటు ఇతర గృహోపకరణాలు ధ్వంసమై భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.
నిరుపేద అయిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని తక్షణ ఆర్థిక సాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.












