ఖానాపూర్, జూలై 29
ఖానాపూర్ మండలంలో కురిసిన భారీ వర్షాల ధాటికి గోసంపల్లి–నడింపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మత్తడి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై ఉన్న రోడ్ డ్యాం నీట మునగడంతో పాత ఎల్లాపూర్, గోసంపల్లి, నడింపల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోసంపల్లి–నడింపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మత్తడి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగుపై ఉన్న రోడ్ డ్యాం పూర్తిగా నీట మునిగిపోవడంతో అది కనిపించని పరిస్థితి నెలకొంది.
దీంతో పాత ఎల్లాపూర్, గోసంపల్లి, నడింపల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే, భారీగా వరద నీరు చేరడంతో సాగునీటి వనరులు సమృద్ధిగా నిండుతుండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ప్రజలు వాగులు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచిస్తున్నారు.












