ఢిల్లీ / చీరాల, 2026-07-20
సీజేపీ పిలుపునిచ్చిన ‘పార్లమెంట్ మార్చ్’ నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో మొబైల్ నెట్వర్క్ సేవలపై తాత్కాలిక పరిమితులు విధించడంతో పలుచోట్ల ఫోన్లు పనిచేయలేదు. భారీ భద్రతా ఏర్పాట్లు, తనిఖీల కారణంగా పార్లమెంట్ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సీజేపీ ఇచ్చిన ‘పార్లమెంట్ మార్చ్’ పిలుపు నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ సేవలపై తాత్కాలిక పరిమితులు విధించడంతో పలుచోట్ల ఫోన్లు సరిగా పనిచేయలేదు.
భారీ భద్రతా ఏర్పాట్లు, వాహనాల తనిఖీల కారణంగా పార్లమెంట్ పరిసరాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. దీంతో పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వస్తున్న ఎంపీలు సహా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో రాకపోకలు నెమ్మదించాయి.












