హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు.
కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో ఘనంగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కేసీఆర్ నాయకత్వం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ఆకాంక్షించారు.
వేడుకల్లో భాగంగా పేదలకు అన్నదానం, పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించినట్లు సమాచారం.

