నిర్మల్, 2026-06-05
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ జయశంకర్ గారి 92వ జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమాంద్ అలీ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
యువతకు స్ఫూర్తి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితాంతం చేసిన పోరాటాన్ని, త్యాగాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.












