నిర్మల్, జూలై 1
అదృశ్యమైన చిన్నారులను గుర్తించి, వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పొడవునా 'ఆపరేషన్ ముస్కాన్ XII' నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. బాల కార్మికత్వం, మానవ అక్రమ రవాణా వంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను రక్షించి, వారికి పునరావాసం కల్పించాలని ఆమె సూచించారు.
అదృశ్యమైన చిన్నారులను గుర్తించి, వారి కుటుంబాలకు సురక్షితంగా చేర్చడమే ఆపరేషన్ ముస్కాన్ XII ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ తెలిపారు. బాల కార్మికత్వం, బాల భిక్షాటనం, మానవ అక్రమ రవాణా వంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి రక్షించడం, వారికి చట్టపరమైన రక్షణ, వైద్య సేవలు, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించి భవిష్యత్తును భద్రపరచడం వంటివి ఈ ఆపరేషన్లో భాగమని ఆమె పేర్కొన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ XII ను విజయవంతంగా అమలు చేయడంపై నిర్మల్ జిల్లా పోలీసు కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆపరేషన్ విజయవంతం కావాలంటే స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ (SJPU), జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO), చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో సహా అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల పొడవునా ఈ ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

