భైంసా మున్సిపాలిటీలో తాజాగా ఎన్నికైన వైస్ చైర్మన్ ఎం.డి. ఇద్రిస్ బైగ్, పలువురు కౌన్సిలర్లను బోస్లె మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు.
మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లె మోహన్ రావు పటిల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 24వ వార్డు అభ్యర్థి అమర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు అభినందనలు తెలియజేస్తూ, ప్రజల ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాలని కోరారు.
పట్టణంలో తాగునీరు, రహదారుల మెరుగుదల, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలపై పురోగతి సాధించాలని సూచించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, పట్టణ సౌకర్యాల విస్తరణపై సమగ్రంగా చర్చించి, అన్ని వర్గాల సమన్వయంతో ముందుకు సాగాలని సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వైస్ చైర్మన్ ఎం.డి. ఇద్రిస్ బైగ్ మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా సేవలు అందిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి కట్టుబడి ఉంటామని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముధోల్ మాజీ ఎంపిపి సుభాష్ పటేల్ జాదవ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

