హైదరాబాద్, 2026-06-05
మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనం కేసులో దొంగలను పట్టించడంలో ఒక చీర కీలక పాత్ర పోషించింది. ఫంక్షన్కు దొంగిలించిన చీర కట్టుకుని వచ్చిన మహిళను గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 2023లో జరిగిన దొంగతనం కేసు బట్టబయలైంది.

కేసు వివరాలు
బండ్లగూడ జాగీర్ వినాయక నగర్ ప్రాంతంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి 2023 సెప్టెంబర్ 16వ తేదీన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 19వ తేదీన తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న రూ.2,50,000 నగదు, 9 తులాల బంగారం, పలు చీరలు దొంగిలించబడ్డాయని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చీరతో దొంగల గుర్తింపు
ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్కు, తమ ఇంటి వెనుక నివసించే స్వప్న(29) అనే మహిళ కట్టుకొచ్చిన చీర తనదేనని యాదయ్య భార్య గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
దంపతుల అరెస్ట్
దీంతో పోలీసులు స్వప్న, ఆమె భర్త రాములు(35)లను అదుపులోకి తీసుకున్నారు. మొదట ఆ చీర తనదేనని బుకాయించినా, అనంతరం యాదయ్య ఇంట్లో తామే దొంగతనం చేశామని స్వప్న, రాములు దంపతులు ఒప్పుకున్నారు.
కేసు నమోదు
వారిపై దొంగతనం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.