** (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 19
లక్ష్మణ్ చాందా మండలం వడ్యాల్ గ్రామంలో "మన రోడ్డు-మన రక్షణ" నినాదంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన షిఫ్టింగ్ ట్రాలీని ఆదివారం ఘనంగా ప్రారంభించారు. వ్యవసాయ పనుల కోసం వాడే ఇనుప చక్రాల వాహనాల వల్ల రోడ్లు పాడవకుండా ఉండేందుకు ఈ ట్రాలీ ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి ఎస్ ఐ శ్రావణి, గ్రామ సర్పంచ్ పసుపుల నరేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వ్యవసాయ పనుల వినియోగం కోసం కేజ్ వీల్స్ (ఇనుప చక్రాలు) కలిగిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలను ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు రోడ్లు పాడుకాకుండా ఉండేందుకు సరికొత్త ముందడుగు పడింది. ఇందులో భాగంగా లక్ష్మణ్ చాందా మండలం వడ్యాల్ గ్రామంలో "మన రోడ్డు-మన రక్షణ" నినాదంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన షిఫ్టింగ్ ట్రాలీని ఆదివారం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎస్ ఐ శ్రావణి, గ్రామ సర్పంచ్ పసుపుల నరేష్ లు ప్రత్యేక పూజలు నిర్వహించి, రిబ్బన్ కట్ చేసి ఈ షిఫ్టింగ్ ట్రాలీని అందుబాటులోకి తెచ్చారు.
ట్రాలీ ప్రారంభోత్సవం అనంతరం గ్రామ పరిధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రోడ్ల రక్షణతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా అత్యవసరమని పేర్కొన్నారు. "మన రోడ్డు-మన పరిరక్షణ" అనే ఉద్దేశంతోనే ఈ మంచి కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












